Sunday, 22 November 2015

chemata viluva and kudumulu nimmakayalu and chali

"రెండు ప్లేట్లు వేడి వేడి గారెలు పట్రావోయ్" ఆర్డరేశాడు బ్రహ్మానందం.
"చిత్తం సార్" వెళ్ళి రెండు నిమిషాల్లో తెచ్చాడు సర్వర్.
"ఆహా... కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది. పిండి రోట్లో రుబ్బారా?" తింటూ అడిగాడు బ్రహ్మానందం.
"అవును సార్"

"ఎంతైనా గ్రైండర్లో రుబ్బితే ఇంత రుచి రాదు. చాలా బాగున్నాయి. మరో నాలుగు పట్రా"
"థ్యాంక్యూ సార్. మీరైనా ‘చెమట’ విలువ గ్రహించారు" వెళ్ళాడు సర్వర్.
--------------

భార్య : ఏమండి మీ కోసం కుడుములు చేసాను తినండి. 
భర్త : అమ్మో నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళూడిపోతాయి, నేను తినను. 
భార్య : తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయ్, మర్యాదగా తినండి. 
----------------------

భార్య :ఏమండి మనింటికి చుట్టాలు వచ్చారు కదా
చల్లగా లెమన్ జూసు
ఇద్దాం అంటే నిమ్మకాయలు లేవండి ఇప్పుడెలా
.
:
: :
:
భర్త : ఎందుకె అంత టెన్సన్ పడుతున్నావ్ కొత్త
విమ్ బార్ లో 100
నిమ్మకాయల శక్తి ఉందిగా దాన్ని కలిపి ఇచ్చేy
------------------

శంభులింగం : ఒరేయ్ జంభూ, అంత చలిగా ఉంటే స్విమ్మింగ్ పూల్ లో ఎలా స్నానం చేస్తున్నావ్ రా?
జంభులింగం : అందుకే స్వెట్టర్ వేసుకొని చేస్తున్నారా శంభూ
-------------------------

No comments:

Post a Comment

sharethis

Gallery