Tuesday, 3 November 2015

భయంకరమైన కధ Last Page

గమనిక: భయంకరమైన కధ (రాత్రిపూట చదవవద్దు. ఒంటరివాళ్లూ, ముసలివాళ్లూ, హార్ట్ ప్రోబ్లెంస్ వున్నావాళూ అసలు చదవవద్దు
ఒక ముసలి వాడు జోరువాన పడుతున్నా లెక్క చేయకుండా, వర్షంలో గొడుగేసుకుని మరీ పుస్తకాలు అమ్ముతున్నాడు.
ఒక యువకుడు అతని దగ్గరకి వచ్చి " ఎంత పుస్తకం ? అన్నాడు.

ముసలివాడు : " మూడు వేలు. కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం , నీకు ఉన్నట్లు కనబడటం లేదు. నీకు నేను ఈ పుస్తకం అమ్మను.
యువకుడు : నాకు చాలా ధైర్యం. ఆ పుస్తకం గంటలో చదివేస్తా
ముసలివాడు : అయితే. నేను నీకు ఆ పుస్తకం ఒక షరతు మీద అమ్ముతాను. ఒక వంద డిస్కౌంట్ కూడా ఇస్తాను.
యువకుడు : ఏమిటా షరతు?
ముసలివాడు : నువ్వు జన్మలో లాస్ట్ పేజ్ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. లెక్కలేనన్ని సమస్యలు వచ్చి పడతాయి.

చచ్చిపొవాలనిపిస్తుంది
యువకుడు : ఒకే! ఒట్టు చివరి పేజీ చదవనులే. ఇదిగో డిస్కౌంట్ పోను 2900. పుస్తకం ఇయ్యి.
ముసలివాడు పుస్తకం ఇచ్చి ఒట్టు గురించి మళ్ళీ జ్ఞాపకం చేశాడు.
అలాగేనని పుస్తకం ఇంటికి వెళ్ళి భయం భయంగా
మొత్తం గబగబా చదివేశాడు. చివరి పేజీ వచ్చేసరికి "ఒట్టు" జ్ఞాపకం వచ్చి ఆ పేజీ తిప్పలేదు. ఓ వారం రోజులు అతి కష్టం మీద ఓపిక పట్టాడు. ఇఖ తట్టుకోలేక పుస్తకం
చివరి పేజీ తెరచి చూశాడు. మూర్చపోయాడు.
..
..
..
..
..
..
..
.లాస్ట్ పేజి లో ఏమి వుంది ??





























రిటైల్ ధర : రూ.30/ మాత్రమే


Telugu Jokes Online





No comments:

Post a Comment

sharethis

Gallery