Wednesday, 18 November 2015

Okkati chaalu

మనం చిన్నప్పుడు నిజాయితీ పై ఒక
కథ చదువుకున్నాము
"ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి
అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా
గొడ్డలి జారి నదిలో పడిపోయింది.
అప్పుడు అతడు దీనంగా నది
ఒడ్డున కూర్చోనుంటాడు

అతనికి దేవుడు ప్రత్యక్ష మై ఎందుకు
భాదపడుతున్నావని అడుగుగా
స్వామీ నా గొడ్డలి పోయి నాకు బతుకు
తెరువు లేకుండాపోయింది అని చెప్పాడు
అప్పుడు దేవుడు అతనికి బంగారు గొడ్డలి ఇవ్వగా ....అతను అది నాది కాదంటాడు
అలాగే వెండి ,ఇత్తడి , రాగి గొడ్డల్లు ఇవ్వజూపగా అవి తనవి కాదంటాడు
ఇనుప గొడ్డలి ఇవ్వగా అది తనదే అంటాడు
అతని నిజాయితీకి మెచ్చి దేవుడు అన్ని గొడ్డల్లు అతనికి ఇచ్చి వెళతాడు
అది పాత కథ ...ప్రస్తుతానికి వస్తే ...
అదే బీదవాడు ఇటీవల తన భార్యను తీసుకొని కట్టెలు కొట్టడానికి తిరిగి అడవికి వెళ్ళాడు
ప్రమాదవశాత్తు అతని భార్య నదిలో
పడిపోయింది ...అతను దీనంగా.
ఒడ్డున కూర్చోనుండగా ...తిరిగి దేవుడు ప్రత్యక్షమై ఏమని అడుగుగా
నా భార్య నదిలో పడిపోయింది
అనగా
దేవుడు అనుష్కను తెచ్చి ఈమేనా నీ భార్య అని అడుగుగా
అవును స్వామీ ఈమే నా భార్య అంటాడు
ఆశ్చర్యపోయిన దేవుడు ...అప్పుడు
నిజాయితీగా ఉండేవాడివి ...ఇప్పుడు
ఎందుకు ఇలా అయ్యావు అని
అడుగుగా
స్వామీ మీరు అనుష్కను చూపెట్టారు
నేను నా భార్య కాదంటాను ...తర్వాత
మీరు తమన్నా , కాజోల్ . సమంతా ను చూపెడతారు .నేను వాళ్ళను కూడా.
కాదంటాను ..అప్పుడు నా భార్యను
చూపెడతారు నేను అవునంటాను
అప్పుడు మీరు అందరిని నాకు ఇచ్చి వెళతారు ....అయ్యో స్వామీ ఒకరితోనే
చాలా కష్టంగా ఉంది .....అందుకే .....

No comments:

Post a Comment

sharethis

Gallery